సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (14:29 IST)

నిద్రిస్తున్న టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి సజీవదహనం... ఎక్కడ?

crime
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని చిల్లకూరు మండలం నాంచారం పేటలో టీడీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. పేరు హరిప్రసాద్. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన టీడీపీ నేత మల్లారపు హరిప్రసాద్ (20) గత రాత్రి తన బంధువు చెలగల కాటయ్యతో కలిసి బయటకు వెళ్లారు. అర్థరాత్రి తర్వత ఇంటికి చేరుకుని గాఢనిద్రలోకి జారుకున్నారు. 
 
ఆ సయమంలో ఇంటిలోకి ప్రవేశించిన దుండగులు... ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో హరిప్రసాద్ నిద్రలోనే సజీవదహనమయ్యారు. వైకాపాకు చెందిన కట్టా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోని దుంపల మధు, ఆయన సహచరులు ఈ దాడికి పాల్పడినట్టు బాధితులు ఆరోపించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.