శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శనివారం, 4 ఆగస్టు 2018 (15:33 IST)

అందుకే.. గూఢ‌చారి 2 ప్లాన్ చేస్తున్నార‌ట‌...

అడవి శేష్, శోభిత ధూళిపాళ జంటగా న‌టించిన చిత్రం గూఢ‌చారి. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర

అడవి శేష్, శోభిత ధూళిపాళ జంటగా న‌టించిన చిత్రం గూఢ‌చారి. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం గూఢచారి ఆగ‌ష్టు 3న రిలీజైంది. అన్ని ఏరియాల నుంచి సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకోవ‌డంతో చిత్ర నిర్మాత‌లు చాలా హ్యాపీగా ఉన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామ మాట్లాడుతూ.. గూఢచారి సినిమాకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యునానిమస్‌గా హిట్ టాక్ వచ్చింది. ఏ నిర్మాతకైనా సక్సెస్ వచ్చినప్పుడు కలిగే ఆనందం వేరేలా ఉంటుంది. మా ఆనందం మాటల్లో చెప్పలేం. ఈ సినిమా సక్సెస్ అవడంతో.. అప్పుడే శేషుకి బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడి వర్క్ చేశారు. సేమ్ టీమ్‌తో మళ్ళీ గూఢచారి 2 ఫిల్మ్ చేయడానికి ప్లాన్ చేయాలి. శేషు స్క్రిప్ట్ రెడీ చేయగానే ఇమ్మీడియట్‌గా సినిమా స్టార్ట్ చేస్తాం అన్నారు.