సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 29 మే 2018 (21:17 IST)

సుమల‌త త‌న‌యుడు హీరోగా చిత్రం ప్రారంభం..!

తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ చిత్రాల్లో న‌టించి... ఎన్నో విజ‌యాలు సాధించి.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్ధానం సంపాదించుకున్న సీనియ‌ర్ హీరోయిన్ సుమ‌ల‌త‌. ఆమె భర్త అంబరీష్ కన్నడ చిత్ర సీమలో రెబల్ స్టార్ అనే విషయం తెలిసిందే. వీరి వారసుడు అభిషేక్

తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ చిత్రాల్లో న‌టించి... ఎన్నో విజ‌యాలు సాధించి.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్ధానం సంపాదించుకున్న సీనియ‌ర్ హీరోయిన్ సుమ‌ల‌త‌. ఆమె భర్త అంబరీష్ కన్నడ చిత్ర సీమలో రెబల్ స్టార్ అనే విషయం తెలిసిందే. వీరి వారసుడు అభిషేక్ హీరోగా ఎంట్రీ  ఇస్తున్నారు. అభిషేక్ ఆకట్టుకునే రూపంతో హీరో అనిపించేలానే ఉంటాడు. అందువలన స్నేహితులంతా ఆయనని ఆ దిశగా ప్రోత్సహించారట.
 
యాక్టింగ్ వైపు ఆసక్తి వున్న అభిషేక్ ఇప్పటికే నటనలోను.. మార్షల్ ఆర్ట్స్‌లోను ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. వైవిధ్య‌మైన క‌ధాంశంతో రూపొందే అమర్ అనే సినిమా ద్వారా అభిషేక్ హీరోగా పరిచయం కానున్నాడు. సందేశ్ నాగరాజ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, నాగ శేఖర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా తాన్యా హోప్‌ను తీసుకున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవ‌ల సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్రారంభ‌మైంది.
 
ఈ విష‌యాన్ని సుమ‌ల‌త ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అభిషేక్‌ని ఆశీర్వదిస్తూ... ఆల్ ది బెస్ట్ చెప్పారు. మ‌రి.. అభిషేక్ విజ‌యం సాధించి త‌న పేరెంట్స్ వ‌లే సిల్వ‌ర్ స్ర్కీన్ పైన తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి.