శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 మే 2018 (15:38 IST)

#ShehanaiBaje అంటున్న ఆఫీసర్ నాగార్జున (వీడియో)

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కాంబినేషన్‌‌లో సుమారు పాతిక సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం "ఆఫీసర్". ఈ చిత్రం వచ్చే నెల ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కాంబినేషన్‌‌లో సుమారు పాతిక సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం "ఆఫీసర్". ఈ చిత్రం వచ్చే నెల ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పిన 'శివ', ఆ తర్వాత వచ్చిన 'గోవిందా గోవింద' చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఆఫీసర్‌పై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌రుగ‌గా, ఈ కార్యక్ర‌మంలో వ‌ర్మ‌, నాగ్‌లు చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. మూవీ మంచి విజ‌యం సాధిస్తుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేశారు. జూన్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్ర వీడియో సాంగ్‌ని తాజాగా విడుద‌ల చేశాడు వ‌ర్మ‌. సిరాశ్రీ రాసిన ఈ పాట‌కి ర‌విశంక‌ర్ సంగీతం అందించారు. 
 
'ఆఫీస‌ర్' చిత్రం కిడ్నాప్ అయిన పాప‌ని ర‌క్షించే నేప‌థ్యంలో రియ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ జీవితమాధారంగా తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. మైరా సరీన్ అనే కొత్త అమ్మాయి ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. బేజీ కావ్యా, ఫిరోజ్‌ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు. కంపెనీ బేనర్‌పై వర్మ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంలోని ఓ పాటను వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేశారు.