సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శనివారం, 26 మే 2018 (14:11 IST)

శ్రీదేవి మరణం నాలో మార్పుకు కార‌ణం అంటోన్ననాగార్జున..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం ఆఫీస‌ర్. రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ జూన్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఓ ఆంగ్ల దిన ప‌త్రికకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీదేవి గురించి న

టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం ఆఫీస‌ర్. రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ జూన్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఓ ఆంగ్ల దిన ప‌త్రికకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీదేవి గురించి నాగార్జున‌ మాట్లాడుతూ... శ్రీదేవి మరణించారంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఆమె మరణం తనకు జీవిత పాఠం నేర్పిందని అన్నారు.
 
శ్రీదేవి హఠాన్మరణం తనలో వ్యక్తిగతంగా మార్పు తీసుకొచ్చిందని, తనకు ప్రియమైన వారిని మరింత ప్రశంసించేలా, వారికి ఇంకా దగ్గరయ్యేలా చేసిందని చెప్పారు. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమలలో నటిగా ఒకేరకమైన ప్రాముఖ్యతను సంపాదించుకున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను మాటల్లో చెప్పలేమని అన్నారు.
 
ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో శ్రీదేవితో కలిసి తాను నటించిన 'గోవిందా గోవింద' చిత్రం గురించి ప్రస్తావించారు. ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కెమెరా ముందు శ్రీదేవి చాలా సంతోషంగా ఉండేవారని, కెమెరా స్విచ్చాఫ్ చేస్తే ఆమె తన నిజ జీవితంలోకి వచ్చేసే వారని చెప్పిన నాగార్జున, తాను నటిస్తున్నంత కాలం శ్రీదేవిని మిస్ అవుతూనే ఉంటానని ఆవేదన వ్యక్తం చేశారు.