1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 26 మే 2018 (13:51 IST)

ఆధ్యాత్మిక వాస్తు చిట్కాలను పాటిస్తే?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని బ్రహ్మ స్థానం అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో బరువైన యంత్ర సామాగ్రి గాని లేదా బరువైన వస్తువులను కాని ఉంచకూడదు. ఒకవేళ గనుక ఉంటే వాటిని తీసివేయడం మంచిది. అవి ఆ స్థానంలోనే ఉంటే, అవి వ్యాపార లాభాలపై తీవ్ర

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని బ్రహ్మ స్థానం అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో బరువైన యంత్ర సామాగ్రి గాని లేదా బరువైన వస్తువులను కాని ఉంచకూడదు. ఒకవేళ గనుక ఉంటే వాటిని తీసివేయడం మంచిది. అవి ఆ స్థానంలోనే ఉంటే, అవి వ్యాపార లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
 
మన ఇంట్లో మంచం లేదా పరుపు ఎక్కడ ఉండాలి అనే విషయం దగ్గర నుండి, గోడపై బొమ్మలను ఎక్కడ ఎలా వేలాడ దీయాలి అనే విషయాలు వరకు, మన యొక్క జీవితంలో మన యొక్క అదృష్టంపై ఇవన్నీ ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తుల అదృష్టాన్ని ఇవి నిర్ణయిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ అతిచిన్న విషయాలన్నీ మన జీవితాల్లో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మన అదృష్ట తలుపులు తెరుచుకోవడానికి పాటించవలసిన వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
డబ్బుల డబ్బా లేదా బీరువాని దక్షిణ దిశలో పెట్టాలి. దాని యొక్క తలుపులు ఉత్తరం దిశకు తెరుచుకునేలా ఉండాలి. ఉత్తర దిశని కుబేర స్థానం అంటారు. కుబేరుడు ధనానికి అధిపతి. వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం అనేది ఒక శక్తివంతమైనది. మన యొక్క శక్తి సామర్ధ్యాలను రెట్టింపు చేసేందుకు అద్దం చాలా ఉపయోగపడుతుంది. మీరు గనుక పర్సులో అద్దాన్ని ఉంచుకున్నట్లైతే మీ ఆర్ధికస్థితిగతులు అతి త్వరలోనే మెరుగుపడతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది.
 
ఇంట్లోని ఈశాన్య మూలాన చెత్త డబ్బాని లేదా చెత్త వస్తువులను గాని ఉంచకూడదు. ఆ వైపున ఎత్తైన భవనం గాని ఉంటే, అటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో తులసి మొక్కని ఉంచుకోవాలి. తులసి మొక్క ఆర్ధికస్థితిగతులపై వ్యతిరేక ప్రభావం చూపించే శక్తులన్నింటిని ఆపివేస్తుంది.
 
ఈశాన్య మూల ఒక దేవతా సంబంధితమైన దిశ. ఈ దిశలో ఎటువంటి వ్యతిరేక శక్తులు రాకూడదు. ఈశాన్యం మూల చిన్న అక్వేరియమ్ ఉంచితే మంచిది. ఆలా ఉంచడం ద్వారా నీటి యొక్క ప్రవాహం అనేది ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతాయి. డబ్బు అధికంగా రావడం మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ఈ వాస్తు చిట్కాలను పాటించిస్తే మంచిది.
 
ఇంటి మూలలు చాలా ముఖ్యమైనవి. నైరుతిమూల అనేది భార్యాభర్త లేదా ఆ ఇంటి మనఃశాంతికి సంబంధించినది. నైరుతి భాగంలో ఉండే దక్షిణం వైపు బరువైన బీరువా ఉంటె ఆ ఇంట్లో ధనం ఎక్కువగా నిలుస్తుంది. ఈశాన్యమూల అనేది సాక్షాత్తు శివుడు ఉండేది అక్కడ పూజచేసే గదికాని, నీళ్ళుకాని పెట్టవచ్చును. ఈ రెండు లేకపోతే గ్లాసులో నీళ్ళుపెట్టి కలువ పువ్వులు వేసి ఉంచవచ్చును. 
 
ఇంటి వాయువ్యదిశలో మెుక్కలు ఉండవచ్చు లేదా ఇంకేదైనా గాలికి కావాల్సిన వస్తువులు ఉండవచ్చును. ఎందుకంటే అదిగాలి ఎక్కువగా ఉండేచోటు. ఇప్పుడు చెప్పిని మూలలు చాలా ముఖ్యమైనవి. వాస్తును ఎక్కువగా ప్రభావితం చేసేందుకు వీటిని పాటించాలి. ఆగ్నేయదిశలో వంటిల్లు ఉండటమే తగినచోటు.