బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (11:51 IST)

మెడమీద నలుపుగా ఉందా? ఈ చిట్కాలు పాటిస్తే?

మీ మెడ నల్లగా మారిందా.. కొన్ని చిట్కాలు పాటించడం వలన మీ మెడ తెల్లగా, మృదువుగా చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి మెడమీద రుద్దుకుని 5 లేదా 10 నిమిషాల తరువాత కడ

మీ మెడ నల్లగా మారిందా.. కొన్ని చిట్కాలు పాటించడం వలన మీ మెడ తెల్లగా, మృదువుగా చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి మెడమీద రుద్దుకుని 5 లేదా 10 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. నిమ్మకాయలలోని విటమిన్ సి మెడమీద ఉన్న మృతకణాలను నాశనం చేస్తుంది. 
 
అలాగే సూర్యరశ్మి వలన వచ్చే నలుపును కూడా తొలగిస్తుంది. ఒక స్పూన్ నిమ్మరసంలో స్పూన్ దోసకాయరసం కొద్దిగా గంధం కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మెడమీద రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. రోజు ఈ విధంగా చేయడం వలన మీ మెడమీద నలుపు త్వరగా తగ్గిపోతుంది.
 
మెడ తెల్లగా కావాలంటే ఒక స్పూన్ గంధంలో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రివేళ మెడకు రాసుకుని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడతెల్లగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా పసుపు కలిపి పెట్టుకున్నాకూడా మెడతెల్లగా కనిపిస్తుంది. ఆలుగడ్డను ముక్కలుగా కోసుకుని రెండు వారాలకోసారి మెడమీద రుద్దుకుంటే మీరే ఆ తేడాని గమనించవచ్చును.
 
బాదంపప్పులను 5 నుంచి 6 తీసుకుని నాలుగుగంటలు నీళ్ళలో నానబెట్టాలి, ఆ తరువాత వాటికి పొట్టుతీసి కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి పడుకునే ముందు మెడమీద రుద్దుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మెడ మీద గల నలుపు తొలగిపోతుంది. కలబంద రసాన్ని మెడమీద రుద్దుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకుంటే మెడతెల్లగా కనిపిస్తుంది.