గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : శనివారం, 19 మే 2018 (12:50 IST)

మేకప్ వేసుకుంటే చర్మ సంరక్షణకి? ఎలా?

మేకప్ వేసుకునే మహిళలు చర్మసంరక్షణని దృష్టిలో పెట్టుకోవాలని బ్యూటీషన్లు సూచిస్తున్నారు. మంచి మేకప్‌కోసం ముందుగా జిడ్డుగాఉన్న ముఖాన్ని క్లీన్‌గా ఉంచుకోవాలి. మీ చర్మం ఏ రకానిదో నిర్ణయించుకును దానికి తగిన

మేకప్ వేసుకునే మహిళలు చర్మసంరక్షణని దృష్టిలో పెట్టుకోవాలని బ్యూటీషన్లు సూచిస్తున్నారు. మంచి మేకప్‌ కోసం ముందుగా జిడ్డుగా ఉన్న ముఖాన్ని క్లీన్‌గా ఉంచుకోవాలి. మీ చర్మం ఏ రకానిదో నిర్ణయించుకును దానికి తగినట్లు క్లీనింగ్‌ మిల్క్‌ని వాడాల్సి ఉంటుంది. మీది పొడి చర్మమైతే నిరభ్యంతరంగా క్లీనింగ్ మిల్క్‌ని వాడవచ్చును. పాలు మీది మీగడలో కొన్ని చుక్కల తేనెను, పసుపును కలిగి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది. 
 
పాలు, నిమ్మరసం, తేనె ఈ మూడు పదార్థాలు బ్యూటీని మెరుగుపరచడంలో గ్రేట్‌గా సహాయపడుతాయి. ఇవి నల్లగా ఉన్న చర్మంను తెల్లగా మార్చుతాయి. ఒక  స్పూన్ పాలు, నిమ్మరసం, తేనె స్పూన్ తీసుకుని, మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే నల్లగా ఉన్న మీ ముఖం అందంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల ఈ మిశ్రమం మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.  
 
జిడ్డుకారే ముఖాలకు క్లీనింగ్ మిల్స్ పనికిరావు. వారికి ఫేషియల్ విధానమే మేలు చేస్తుంది. మీ చర్మం క్లీనింగ్ కోసం మామూలు సబ్బులకు బదులు హెర్బల్ సోప్స్‌ని వాడటం ఉత్తమం. లిక్విడ్ సోప్‌తో క్లీన్ చేసుకునేవారు సబ్బు పూర్తిగా తొలగేలా చూసుకోవాలి. మిగిలిన సబ్బు-క్లీనింగ్ మిల్క్ తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. సమస్యాత్మక చర్మం కలవారికి ఆయిల్‌టోన్ హాని చేయవచ్చునని బ్యూటీషన్లు తెలియజేయుచున్నారు.