సోమవారం, 7 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 14 మే 2018 (14:39 IST)

వేసవిలో ఎన్ని లీటర్ల నీరు త్రాగాలో తెలుసా?

శరీరంపైన మలినాలను తొలగించేది జల స్నానం అయితే, శరీరం లోపలి మలినాలను కడిగి జీవక్రియలకు తోడ్పడేది జలపానం. ఈ పంచ భూతములలో గాలి తర్వాత స్థానం నీటిదే. మన శరీరంలో అన్నిటికంటే నీరే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంద

శరీరంపైన మలినాలను తొలగించేది జల స్నానం అయితే, శరీరం లోపలి మలినాలను కడిగి జీవక్రియలకు తోడ్పడేది జలపానం. ఈ పంచ భూతములలో గాలి తర్వాత స్థానం నీటిదే. మన శరీరంలో అన్నిటికంటే నీరే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంది. చివరికి మనం నివశించే భూభాగంలోనూ మూడింతలు నీరే ఉంటాయి. అలాగే మన శరీరంలో కూడా దాదాపు 68 శాతం నీరు ఆక్రమించి వుంటే, కేవలం 32 శాతం మాత్రమే ఇతరాలు ఆక్రమించి ఉన్నాయి.  
 
కానీ ప్రస్తుత కాలంలో ఖరీదైన జీవితానికి అలవాటుపడిన మనిషికి నీటి ఆవశ్యకత తెలియక రోగాల పాలవుతున్నారు. నీటికి బదులు కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్,  తాగి లేనిపోని రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. సాధారణంగా ఒక వంతు పదార్ధానికి మూడు వంతుల నీటిని పుచ్చుకోవడం శరీర ధర్మం. 
 
* పెద్దలు కనీసం ఐదు లీటర్ల నుంచి 6 లీటర్ల వరకు నీళ్లును తాగితే శరీరం సమతుల్యంగా ఉంటుంది.
* పిల్లల విషయానికొస్తే వారు 1 కేజీ నుండి 2 కేజీల వరకు ఆహారాన్ని తీసుకుంటారు కాబట్టి వారు రోజుకు 3 నుండి 4 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి.
* ఉదయం నిద్రలేచిన వెంటనే లీటరు నుండి లీటరున్నర వరకు నీళ్లను త్రాగాలి.
* నీళ్ళు తాగిన తర్వాత 20 నిమిషాల వరకు ఏ పదార్ధమూ తీసుకోకూడదు.
* ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉండే పదార్ధాలను అంటే ఆకుకూర, పండ్లలో కూడా 70 నుంచి 80 శాతం వరకు నీరు ఉంటుంది కనుక వాటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.