సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 15 మే 2018 (17:56 IST)

జస్ట్ ఆస్కింగ్... ప్రకాష్ రాజ్ ప్రభావం ఎక్కడ?

జస్ట్ ఆస్కింగ్... ఈ మాట చూడగానే టక్కున నటుడు ప్రకాష్ రాజ్ గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఆయన ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎన్నో విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశ్నాస్త్రాలు సంధించేందుకు ఈ జస్ట్ ఆస్కింగును బాగా

జస్ట్ ఆస్కింగ్... ఈ మాట చూడగానే టక్కున నటుడు ప్రకాష్ రాజ్ గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఆయన ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎన్నో విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశ్నాస్త్రాలు సంధించేందుకు ఈ జస్ట్ ఆస్కింగును బాగా ఉపయోగించుకున్నారు. తాజాగా జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పర్యటన సమయంలో భాజపాను ఓడించాలంటూ ట్వీట్లు పెట్టారు. 
 
భాజపా గెలిస్తే ప్రమాదకరం అని కర్నాటక రాష్ట్రంలో తిరిగి చెప్పారు. కానీ ప్రకాష్ రాజ్ మాటలను పట్టించుకున్నట్లు కనబడలేదు. ఆ రాష్ట్ర ప్రజలు చక్కగా భాజపాకు ఓట్లు వేసేశారు. దాదాపుగా 105 స్థానాలను కైవసం చేసుకునే దిశగా అతిపెద్ద పార్టీగా భాజపా దూసుకువెళుతోంది. అధికార పగ్గాలు చేపట్టేందుకు జస్ట్ ఆరేడు స్థానాలకు దూరంగా వుంది. మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ కర్నాటక ప్రజలను అడుగుతారా లేదంటే నరేంద్ర మోదీని అడుగుతారా.... చూడాలి.