బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Srinivas
Last Modified: గురువారం, 10 మే 2018 (13:09 IST)

ప‌వ‌న్‌కి ప్ర‌కాష్ రాజ్ వార్నింగ్... నేను మాత్రం పవన్‌లా చేయనంతే...

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి.. సినిమాల‌కు గుడ్ బై చెప్పి... రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్ప‌టి నుంచి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప‌వ‌న్ గురించి వారి అభిప్రాయాల‌ను తెలియ‌చేస్తూనే ఉన్నారు. కొంతమంది ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికిరాడ

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి.. సినిమాల‌కు గుడ్ బై చెప్పి... రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్ప‌టి నుంచి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప‌వ‌న్ గురించి వారి అభిప్రాయాల‌ను తెలియ‌చేస్తూనే ఉన్నారు. కొంతమంది ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు అంటే.. కొంతమంది ప‌వ‌న్ నిజాయితీ గ‌ల నాయ‌కుడు అంటూ వారి స్పంద‌న తెలియ‌చేసారు. తాజాగా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తొలిసారి జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ ప్ర‌వేశం గురించి కామెంట్ చేసారు.
 
ప్రకాష్ రాజ్ ఇప్పుడు సినిమాల్లో కంటే.. రాజకీయ వివాదాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాజకీయా పార్టీలపై ఆయన మాటల తూటాలు పేల్చుతూ వార్తల్లో ఉంటున్నారు. బీజేపీ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై ఎలా స్పందిస్తారనే ఆసక్తి సర్వాత్రా నెలకొంది. జనసేన పార్టీతో జనాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై ప్రకాష్ రాజ్ తొలిసారిగా స్పందిస్తూ... ఆయనకు కొన్ని సూచనలు చేశారు. 
 
పవన్ కళ్యాణ్ ముక్కుసూటి మనిషి. ఆయనకు బోలెడంత పాపులారిటీ ఉంది. చాలామంది ఆయన పార్టీలో చేరతారు. పార్టీలో చేరే వ్యక్తుల గురించి అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్‌ను ప్రకాష్ రాజ్ హెచ్చరించారు. అవకాశవాదులైన రాజకీయ నేతలతో పవన్ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పవన్ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నానని, కానీ.. ఆయనలా రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని చెప్పారు. మ‌రి.. ప్ర‌కాష్ రాజ్ స్పంద‌నపై ప‌వ‌న్ ప్ర‌తి స్పందిస్తారేమో చూడాలి..!