శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 9 మే 2018 (08:38 IST)

ఆ విషయంలో పవన్ 100 శాతం బెటర్ : సీపీఐ నారాయణ

సీపీఐ జాతీయ నేత కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లలో ఎవరు బెటర్ అనే ప్రశ్న ఎదురైనపుడు ఆయన తన మనసులోని మాటను స్పష్టంగా వెల్లడించారు.

సీపీఐ జాతీయ నేత కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లలో ఎవరు బెటర్ అనే ప్రశ్న ఎదురైనపుడు ఆయన తన మనసులోని మాటను స్పష్టంగా వెల్లడించారు. 
 
ప్రతిపక్ష నేత జగన్‌తో పోలిస్తే.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వంద శాతం బెటరని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. పవన్‌కు మాత్రం బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. అందుకే పవన్‌తో సీపీఐ సంబంధాలు పెట్టుకుందన్నారు. 
 
ఇకపోతే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దమ్ముంటే ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు పెట్టాలన్నారు. అలాగే, ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ మీద కూడా కేసు నమోదు చేయాలన్నారు. అలాగే అక్రమాస్తుల కేసులో జగన్ మీద చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. ఈ మూడు పనులు చేసే దమ్మూధైర్యం ఒక్క మోడీకే కాదు.. బీజేపీ నేతల్లో ఎవరికీ లేదని విమర్శించారు.