బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 9 మే 2018 (12:31 IST)

చంద్రబాబు నిస్సహాయ స్థితిలో వున్నారు.. పవన్ జాగ్రత్తగా వుండాలి: ప్రకాశ్ రాజ్

సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీలా అసత్యాలు చెప్పే వారిని తాను ఎక్కడా చూడలేదని, తాము సర్కారుని ప్రశ్నిస్తోంటే వారు వ

సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీలా అసత్యాలు చెప్పే వారిని తాను ఎక్కడా చూడలేదని, తాము సర్కారుని ప్రశ్నిస్తోంటే వారు వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతున్నారని మోదీపై ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ప్రశ్నిస్తున్నందుకే తనకు నటించడానికి కమర్షియల్ యాడ్స్ కూడా రావడం లేదని చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్ చేశారు. ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. దీంతో ఏపీ ప్రజలకు చాలా అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. కేంద్ర సర్కారు నుంచి సాయం అందకపోవడంతో చంద్రబాబు నిస్సహాయంగా వున్నారని.. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును ఏమీ అనలేమని తెలిపారు. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదాని అడుక్కోవడం లేదని.. అది సాధించుకోవడం వాళ్ల హక్కు అని ప్రకాశ్ రాజ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోతే.. ఏపీ ఎలా ఎదుగుతుందని ప్రశ్నించారు. 
 
మరోవైపు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ పార్టీ పెట్టారని.. అయితే జనసేనలోకి వచ్చే వలస నేతలతో జాగ్రత్తగా వుండాలన్నారు. వలస నేతలు మోసం చేసే ప్రమాదం వుందన్నారు. ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నిస్తోన్న పవన్‌ను ఆహ్వానిద్దామని ప్రకాశ్ రాజ్ తెలిపారు.