బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 24 మే 2018 (11:40 IST)

పచ్చని అరటి పండును తింటే బరువు తగ్గుతారట.. మీకు తెలుసా?

ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహిస్తున్నారు. వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, వేళకు భోజనం చేయడం ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బరువు తగ్గాలని కచ్చితంగా నిర్ణయించుకున్న వారు మా

ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహిస్తున్నారు. వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, వేళకు భోజనం చేయడం ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇవే కాకుండా బరువు తగ్గాలని కచ్చితంగా నిర్ణయించుకున్న వారు మాత్రం ఆరోగ్యకరమైన డైట్‌ను పాటించడం అవసరం. పండ్లు అధిక బరువును తగ్గించేందుకు దోహదపడడంతోపాటు శరీరానికి కావలసిన పౌష్టికాహారాన్ని కూడా అందిస్తాయి. వాటికి సంబంధించిన వివరాలు మీ కోసం.. 
 
యాపిల్స్‌లో క్యాలరీలు తక్కువగా, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఆహారాన్ని జీర్ణంచేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పెక్టిన్ కడుపు నిండినభావనను కలుగజేస్తుంది. దీన్ని తినడం వలన త్వరగా ఆకలివేయదు. అదేవిధంగా మన శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లను ఇది పుష్కలంగా అందిస్తుంది. 100 గ్రాముల యాపిల్ తింటే దాదాపు 1500 మిల్లీగ్రాముల విటమిన్ సి అందుతుంది. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 
 
అరటిపండులో నీరు అధికంగా ఉంటాయి. ఆకుపచ్చరంగులో ఉండే అరటిపండ్లలో వేగవంతంగా బరువుతగ్గించడానికి గల పోషకాలు ఉన్నాయి. అరటిపండు ఒకటి తిన్నా కడుపునిండిన భావన కలుగుతుంది. అప్పుడప్పుడు అరటిపండ్లు తిని నీరు త్రాగడం వలన రోజంతా కడుపు నిండుగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి చాలా మంచిది.
 
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ టమాటాల్లో పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఇందులో లభిస్తాయి. వీటిలోని లైకోపీన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టమాటా జ్యూస్‌ను నిత్యం తీసుకుంటే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. 
 
నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. స్లిమ్‌గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఎసిడిటీ వంటి అనారోగ్యాలను దూరంచేస్తుంది. భోజనం చేసిన తరువాత నిమ్మరసాన్ని త్రాగడం శరీరానికి చాలా మంచిది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని సిట్రస్ యాసిడ్ శరీర బరువు పెరగనీయకుండా చేస్తుంది. నిమ్మరసం, తేనెల మిశ్రమం మహిళల బరువు తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. కొవ్వు కణాలతో పోరాడగలిగే శక్తి నిమ్మకు ఉంది. ఇది ఆకలిని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.