సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 మే 2018 (15:48 IST)

నాకు కేన్సరా.. ఎవరు చెప్పారు.. అంతా ఉత్తుత్తిదే: రాధిక

డిజిటల్ యుగంలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియడం లేదు. ఉత్తుత్తి వార్తలను సృష్టించి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఆ వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీల ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో

డిజిటల్ యుగంలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియడం లేదు. ఉత్తుత్తి వార్తలను సృష్టించి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఆ వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీల ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో వస్తున్న వార్తలు మరీ ఎక్కువైపోతున్నాయి. దీంతో సెలెబ్రిటీలే స్వయంగా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
తాజాగా సీనియర్ నటి రాధికకు కేన్సర్ సోకిందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అదీ కూడా బ్లడ్ కేన్సర్ సోకిందనీ, అందుకే కొన్నాళ్ళుగా బయట ఎక్కువగా కనిపించడం లేదంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే విషయంపై ఓ అభిమాని రాధికని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. దీనికి రాధిక ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టి పారేసింది. మొత్తంమీద కొందరు పోకిరీలు చేసే దుష్ప్రచారం వల్ల ఇటు ఫ్యాన్స్‌తో పాటు.. అటు సెలెబ్రిటీలు బెంబేలెత్తిపోతున్నారు.