శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 మే 2018 (11:01 IST)

వణికిస్తున్న నిపా... వైరస్ పుట్టుపూర్వోత్తరాలు...

దేశాన్ని వణికిస్తున్న వైరస్ నిపా. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే కేరళ రాష్ట్రంలో 10 మందికి మృత్యువాతపడ్డారు. ఈ తరహా వైరస్‌ను తొలిసారి దక్షిణభారతంలో కనుగొనడం ఇదేతొలిసారి. అసలు ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలను ఓ

దేశాన్ని వణికిస్తున్న వైరస్ నిపా. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే కేరళ రాష్ట్రంలో 10 మందికి మృత్యువాతపడ్డారు. ఈ తరహా వైరస్‌ను తొలిసారి దక్షిణభారతంలో కనుగొనడం ఇదేతొలిసారి. అసలు ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలను ఓసారి పరిశీలిస్తే...
 
ఈ నిపా వైరస్‌ను తొలిసారి 1998లో మలేసియాలో కనుగొన్నారు. అప్పట్లో మలేసియాలో 105 మంది ఈ వ్యాధితో మృతి చెందారు. ఆ తర్వాత సింగపూర్‌లోనూ ఈ వైర్‌సను గుర్తించారు. పందులను పెంచే పశుపోషకులు ఈ వ్యాధి బారినపడి మృతి చెందారు. మలేసియాలోని నిపా ప్రాంతానికి చెందిన వారిలో తొలిసారిగా ఈ వైర్‌సను కనుగొన్నారు. దీంతో ఈ వైరస్‌కు నిపాగా నామకరణం చేశారు. ఈ వైరస్‌ను తొలిసారి పందుల్లో గుర్తించారు. 
 
ఆ తర్వాత 2004లో బంగ్లాదేశ్‌లో కూడా ఈ వైరస్‌ ప్రబలి, మరణాలు సంభవించాయి. అనంతరం మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాల్లో ఈ వైరస్‌ వెలుగుచూసింది. నిపా వైరస్‌ బారిన పడిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణాలు 3-14 రోజుల వరకు ఉంటాయి. 
 
ఈ వైరస్ బారినపడిన వారికి జ్వరం, తలనొప్పి, మగత, మానసిక సంతులనం తగ్గడం, శ్వాసకోశ ఇబ్బందులు, ఎన్‌సెఫలైటిస్‌, మయోకార్డైటిస్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. దీని నివారణకు వ్యాక్సిన్‌ లేదు. గబ్బిలం, పందులు, కోతి, పిల్లి వంటివి ఈ వైర్‌సకు వాహకాలుగా పనిచేస్తున్నాయి. 
 
రక్షణ చర్యలేంటి... 
* వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండటం. 
* ఇంటితోపాటు.. ఇంటిలోని వస్తువులు శుభ్రంగా ఉంచడంతో పాటు.. మూతలు వేసివుంచడం. 
* నీటితో శుభ్రంగా కడిగిన తర్వాతే పండ్లను ఆరగించాలి. 
* మామిడి పండ్ల సీజన్‌లో చిన్నపిల్లల ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచడం.