గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 21 మే 2018 (11:21 IST)

శొంఠిని బియ్యపు పిండిలో కలిపి తీసుకుంటే? మీ ఆరోగ్యానికి?

శొంఠి ఒక రకమైన ఆయుర్వేదంగా ఉపయోగించే మందు. ఈ శొంఠిని అల్లంను ఎండబెట్టి తయారుచేస్తారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతుంటారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు. శొంఠ

శొంఠిని అల్లంను ఎండబెట్టి తయారుచేస్తారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో  వాడుతుంటారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు. శొంఠి జీర్ణశక్తిని పెంచుతుంది. కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది. దగ్గు, ఆయాసము, వాంతి, గుండె జబ్బులను తగ్గిస్తుంది. మూలవ్యాధి, కడుపుబ్బరము, కడుపునొప్పి, మలబద్ధకంను తగ్గిస్తుంది. 
 
శొంఠిని వేడిచేసిన నీటిలో మరిగించి, ఆ నీళ్ళతో స్నానం చేసినట్లైతే కీళ్ళ నొప్పులు తగ్గుటకు ఉపయోగపడుతుంది. శొంఠి ముక్కను నమిలి బుగ్గన పెట్టుకుంటే పంటి నొప్పులు, చిగురు నొప్పులు తగ్గుతాయి. శొంఠిని అరగదీసిన ఆ గంథాన్ని కణతలకు రాసుకుంటే తలనొప్పి వంటి వాటిని నివారిస్తుంది. దీని పొడిని బియ్యపు పిండితో కలిపి నుదిటి మీద పట్టీలా వేసుకున్నా తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది.
 
అరలీటరు మంచి నీళ్ళలో పది గ్రాముల శొంఠిని వేసి బాగా మరగబెట్టి, ఆ నీళ్ళను శుభ్రంగా వడగట్టి కషాయంగా తీసుకుంటే పొడిదగ్గు, విరేచనాలను దూరం చేస్తుంది. శొంఠి, జీలకర్ర, కొత్తిమీర సమాన భాగాలుగా తీసుకుని వాటిని నీళ్ళల్లో వేసి మరిగించి, వడగట్టి, చల్లార్చి తాగితే ఆరోగ్యానికి మంచిది. పదిగ్రాముల శొంఠిని అరగదీసి పులిసిన మజ్జిగలో కలుపుకుని రోజుకు మూడ సార్లు తాగితే కడుపుకు సంబంధించిన వ్యాధులు దూరమగుటకు ఉపయోగపడుతుంది.
 
శొంఠి పొడిని నేతిలో కలిపి అన్నంలో తీసుకుంటే అజీర్ణశక్తికి చాలా ఉపయోగపడుతుంది. బాలింతరాలుకు శరీరం గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతుంటారు. పసి పిల్లల అజీర్ణ సమస్యకు శొంఠిని తక్కువ మోతాదులో వాడుతుంటారు. జిగురు, రక్తవిరోచనాలకు శొంఠిని రాత్రివేళ ఆవు మజ్జిగలో నానబెట్టి ఉదయం ఆ మజ్జిగతోనే ఆ శొంఠిని నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి వాడుతుంటారు.