1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. few people accidentally dead when they gone to wash room, why

చాలామంది బాత్రూమ్‌లో పడి చనిపోతున్నారు.. ఎందుకో తెలుసా?

ఈమధ్య కాలంలో బాత్రూంలో పడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. అసలు ఎందుకు బాత్రూంలో పడి జనం చనిపోతున్నారని వైద్యులు అధ్యయనం చేశారు. అందులో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ విషయం కాస్త వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్రూంకు వెళ్లే వాళ్ళు రాత్రి

people
ఈమధ్య కాలంలో బాత్రూంలో పడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. అసలు ఎందుకు బాత్రూంలో పడి జనం చనిపోతున్నారని వైద్యులు అధ్యయనం చేశారు. అందులో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ విషయం కాస్త వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్రూంకు వెళ్లే వాళ్ళు రాత్రి వేళల్లో ఎక్కువగా చనిపోతున్నారని ఒక నిర్ధారణకు వచ్చారు. 
 
రాత్రి వేళల్లో బాత్రూంకు వెళ్ళేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు వైద్యులు. రాత్రిల్లో మెలుకవ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలంటున్నారు వైద్యులు. ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపైన కూర్చుని ఉండాలట. ఆ తరువాత రెండున్నర నిమిషాల పాటు కాళ్లు కిందకు వేసి కూర్చున్న తరువాత వాష్‌రూంకు వెళ్ళాలట. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చట. 
 
ఎందుకంటే వెంటనే లేచి వెళ్ళినప్పుడు మెదడుకు రక్తప్రసరణ లోపిస్తుందట. గుండె కొట్టుకోవడంలో తేడాలు వుంటాయట. కాబట్టి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈ నియమాన్ని పాటించాలంటున్నారు వైద్యులు.
తర్వాతి కథనం
అందానికి 5 చిట్కాలు... ఏంటో చూడండి