పీఎఫ్ పోర్టల్ డేటా లీకైందా? 2.7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారుల వివరాలు?  
                                          ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారుల వివరాలు హ్యాక్‌కు గురైయ్యాయి. దేశవ్యాప్తంగా 2.7కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారుల వివరాలు ప్రమాదంలో పడ్డాయి. ఆధార్‌ను అనుసంధానం చేసిన ఈపీఎఫ్‌వో పోర్టల్ నుంచి మార్చిలో కోట్లా
                                       
                  
				  				   
				   
                  				  ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారుల వివరాలు హ్యాక్‌కు గురైయ్యాయి. దేశవ్యాప్తంగా 2.7కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారుల వివరాలు ప్రమాదంలో పడ్డాయి. ఆధార్‌ను అనుసంధానం చేసిన ఈపీఎఫ్‌వో పోర్టల్ నుంచి మార్చిలో కోట్లాదిమంది ఖాతాదారుల వివరాలు హ్యాక్‌కు గురైనట్లు సమాచార మంత్రిత్వ శాఖకు సాక్షాత్తూ కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ లేఖ రాయడం కలకలం రేపుతోంది. 
	
				  
	 
	ఈ నేపథ్యంలో పీఎఫ్ వెబ్‌సైట్‌లో ఏవైనా లోపాలుంటే సరిచేయాల్సిందిగా మంత్రిత్వ శాఖ సాంకేతిక సిబ్బందిని కోరారు. సీక్రెట్ పేరుతో ఇంటెలిజెన్స్ బ్యూరోకు కమిషనర్ రాసిన లేఖలో వెబ్‌సైట్‌లోని లోపాలే డేటా లీకేజీకి కారణమని తెలుస్తోంది. 
				  											
																													
									  
	 
	అయితే పీఎఫ్ డేటా లీకేజీపై ఈపీఎఫ్‌వో స్పందించింది. అలాంటిదేమీ జరగలేదంటూ ప్రకటన విడుదల చేసింది. డేటా లీక్‌కు సంబంధించి వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేసింది. ఆధార్‌ను అనుసంధానం చేసే సైట్‌ను మరింత మెరుగుపరిచేందుకే.. ప్రస్తుతానికి వెబ్‌సైట్ సేవలను ఆపేసినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది.