ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 26 మే 2018 (08:54 IST)

శ్రీదేవి మరణంతో మారిపోయా... హీరో నాగార్జున

వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో తాను వ్యక్తిగతంగా ఎంతో మారిపోయినట్టు హీరో అక్కినేని నాగార్జున చెప్పారు. ముఖ్యంగా, శ్రీదేవి మృతి చెంది ఇన్ని రోజులవుతున్నా ఆమె స్మృతులు మాత్రం ఇంకా వెంటాడుతున్నాయ

వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో తాను వ్యక్తిగతంగా ఎంతో మారిపోయినట్టు హీరో అక్కినేని నాగార్జున చెప్పారు. ముఖ్యంగా, శ్రీదేవి మృతి చెంది ఇన్ని రోజులవుతున్నా ఆమె స్మృతులు మాత్రం ఇంకా వెంటాడుతున్నాయని చెప్పారు. శ్రీదేవి మరణించారంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఆమె మరణం తనకు జీవిత పాఠం నేర్పిందన్నారు.
 
ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, శ్రీదేవి హఠాన్మరణం తనలో వ్యక్తిగతంగా మార్పు తీసుకొచ్చిందని, తనకు ప్రియమైన వారిని మరింత ప్రశంసించేలా, వారికి ఇంకా దగ్గరయ్యేలా చేసిందన్నారు. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమలలో నటిగా ఒకే రకమైన ప్రాముఖ్యతను సంపాదించుకున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను మాటల్లో చెప్పలేమని అన్నారు. 
 
తామిద్దరం కలిసి నటించిన 'గోవిందా గోవింద' చిత్రం గురించి స్పందిస్తూ, ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కెమెరా ముందు శ్రీదేవి చాలా సంతోషంగా ఉండేవారని, కెమెరా స్విచ్చాఫ్ చేస్తే ఆమె తన నిజజీవితంలోకి వచ్చేసే వారని చెప్పిన నాగార్జున, తాను నటిస్తున్నంత కాలం శ్రీదేవిని మిస్ అవుతూనే ఉంటానని ఆవేదన వ్యక్తంచేశారు.