శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (12:07 IST)

నాగార్జున-నాని మ‌ల్టీస్టార‌ర్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్..!

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే.. ఈ మూవీ రీమేక్‌ అంటూ వార్త‌లు వ‌చ్చాయి.
 
సోషల్‌ మీడియా హవా కొనసాగుతున్న ఈ తరుణంలో ఇలాంటి రూమర్స్‌ మరింత వేగంగా అందరికి చేరుతాయి. దీంతో చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఈ వార్త‌లపై  స్పందించారు.
 
 ఇంత‌కీ శ్రీరామ్ ఆదిత్య ఏమ‌న్నారంటే... తాను నాగ్‌, నానిలతో రూపొందిస్తున్న మూవీ ఏ సినిమాకు రీమేక్ కాదు. బయట వస్తున్నవార్త‌ల్లో  ఏ మాత్రం నిజం లేదంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. 
 
సోషల్ మీడియాలో ఈ మూవీ బాలీవుడ్‌ సినిమా జానీ గద్దర్‌కు రీమేక్‌ అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.