శనివారం, 2 డిశెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : సోమవారం, 28 మే 2018 (11:42 IST)

ఐపీఎల్ కాదు సీపీఎల్... చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాస్త చెన్నై ప్రీమియర్ లీగ్‌గా మారిపోయింది. ఆ జట్టు తొమ్మిదిసార్లు ఐపీఎల్‌ ఆడితే ఏడుసార్లు ఫైనల్‌ చేరింది. మూడుసార్లు కప్పు గెలిచింది. నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. అందుకే.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాస్త చెన్నై ప్రీమియర్ లీగ్‌గా మారిపోయింది. ఆ జట్టు తొమ్మిదిసార్లు ఐపీఎల్‌ ఆడితే ఏడుసార్లు ఫైనల్‌ చేరింది. మూడుసార్లు కప్పు గెలిచింది. నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. అందుకే... ఐపీఎల్ కాస్త.. సీపీఎల్‌గా మారిపోయిందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా, ఐపీఎల్‌లో ప్రతిసారీ సెమీస్ లేదా ప్లేఆఫ్‌ దశకు అర్హత సాధించిన ఏకైక జట్టు చెన్నై సూపర్‌కింగ్సే కావడం గమనార్హం.
 
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న రైనానే. అతను 176 మ్యాచ్‌లు ఆడితే, ధోని 175 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌ అత్యధిక పరుగుల రికార్డూ రైనాదే. అతను 4985 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ అత్యధిక మ్యాచ్‌లకు (159) నాయకత్వం వహించిన ఆటగాడు ధోనీ. ఇలా ఐపీఎల్‌కు సంబంధించి ఏ గణాంకాలు తీసినా చెన్నై ఆధిపత్యం కనిపిస్తుంది. అందుకే ఆ జట్టు అభిమానులు ఐపీఎల్‌ను సీపీఎల్‌ అంటుంటారు.
 
చెన్నైకిది మూడో ఐపీఎల్‌ ట్రోఫీ. ఇంతకుముందు 2010, 11ల్లోనూ విజేతగా నిలిచింది. అత్యధిక టైటిళ్లతో ఉన్న ముంబైని సమం చేసింది. ఆ జట్టు ఏడుసార్లు ఫైనల్‌ ఆడగా.. నాలుగుసార్లు (2008, 12, 13, 15) రన్నరప్‌గా నిలిచింది. ఇకపోతే, ఈ సీజన్‌లో హైదరాబాద్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నైనే గెలిచింది. దాంతో, ఒక సీజన్‌లో ఒక జట్టును నాలుగు సార్లు ఓడించిన తొలి జట్టుగా చెన్నై రికార్డు సృష్టించింది. 
 
రెండు ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన రెండో జట్టు చెన్నై. ముంబైతో సహా ఆ జట్టు మూడుసార్లు విజేతగా నిలిచింది. ఒక సీజన్‌లో రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడు షేన్ వాట్సన్ కావడం గమనార్హం. ఈ ఆటగాడు ఐపీఎల్‌లో చేసిన అత్యధిక స్కోరు 117 రన్స్.