శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శనివారం, 16 జూన్ 2018 (22:02 IST)

గూఢ‌చారిగా అడ‌వి శేష్ ప్ర‌య‌త్నం ఫ‌లించేనా..?

క్ష‌ణం సినిమాతో చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అడ‌వి శేష్ తాజా చిత్రం గూఢ‌చారి. ఈ చిత్రంలో అడ‌వి శేష్, శోభిత ధూలిపాళ్ల జంట‌గా న‌టించారు. నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్కా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్ర

క్ష‌ణం సినిమాతో చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అడ‌వి శేష్ తాజా చిత్రం గూఢ‌చారి. ఈ చిత్రంలో అడ‌వి శేష్, శోభిత ధూలిపాళ్ల జంట‌గా న‌టించారు. నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్కా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. అమెరికా, హిమాచల్‌ ప్రదేశ్, పూణే, ఢిల్లీలో షూటింగ్ చేసారు. ఆగ‌ష్టు 3న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా అడ‌వి శేష్ తెలియ‌చేసారు.
 
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరోయిన్‌ సుప్రియ యార్లగడ్డ ఈ సినిమా ద్వారా రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె ఓ మంచి పాత్ర చేశారు అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. స్పై థ్రిల్ల‌ర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ప్ర‌తి స‌న్నివేశం చాలా కొత్త‌గా ఉంటుంది. ఆడియ‌న్స్‌కి ఓ కొత్త అనూభూతి క‌లిగిస్తుంద‌ని అడ‌వి శేష్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. మ‌రి... అడ‌వి శేష్ చేస్తోన్న ఈ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందో లేదో తెలియాలంటే ఆగ‌ష్టు 3 వ‌ర‌కు ఆగాల్సిందే..!