శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (14:06 IST)

వ్యభిచారం కోసం సంప్రదించారు.. పాపులారిటీని బట్టి ధర: శ్రీరెడ్డి

అమెరికాలోని చికాగోలో వెలుగు తెలుగు నటీమణుల వ్యభిచార దందాపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు స్పందిస్తున్నారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో మంచి పాపులర్ అయిన నటి శ్రీరెడ్డి కూడా స్పందించా

అమెరికాలోని చికాగోలో వెలుగు తెలుగు నటీమణుల వ్యభిచార దందాపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు స్పందిస్తున్నారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో మంచి పాపులర్ అయిన నటి శ్రీరెడ్డి కూడా స్పందించారు.
 
'ఆ అమెరికా ఎన్నారైలు వ్యభిచారం కోసం తనను కూడా సంప్రదించారు. అవకాశాల్లేని హీరోయిన్లను ఈవెంట్స్‌ కోసం అమెరికాకు రప్పించి.. అక్కడ వారిని మభ్యపెట్టి వ్యభిచారాంలోకి దింపుతున్నారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు సుమారు 1000 అమెరికా డాలర్లు ఆఫర్‌ చేస్తున్నారు. ఈ ఆఫర్‌ వారి పాపులారిటీని బట్టి ఉంటుందని' అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. 
 
కాగా, టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేకిత్తించిన చికాగో వ్యభిచారం రాకెట్‌ బాధితుల్లో ఇద్దరు టాప్‌ హీరోయిన్లు ఉన్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వారిలో ఓ  హీరోయిన్ చాలా పొడవుగా ఉంటుందనే లీకులు వినిపిస్తున్నాయి. అయితే, వ్యభిచారంలో పాల్గొన్న హీరోయిన్ల పేర్లు బయటకు రాకపోయినప్పటికీ తెలుగు హీరోయిన్సే ఈ వ్యభిచార దందాలో కీలక పాత్ర పోషించారనే ప్రచారం జరుగుతోంది. కాగా, అమెరికాలో టాలీవుడ్‌ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న తెలుగు దంపతులను ఫెడరల్‌ ఏజెన్సీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.