సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: శుక్రవారం, 15 జూన్ 2018 (17:07 IST)

కేరళలో శ్రీరెడ్డీ... నాని డర్టీ పిక్చర్ జూన్ 14 విడుదలన్నారు... ఎక్కడ? నెటిజన్స్ ప్రశ్నలు

ఛానళ్లలో తన ఆవేదనను, తన పోరాటాన్ని పట్టించుకోవడం లేదనీ, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో యాక్టివ్‌గా వున్న శ్రీరెడ్డి ప్రస్తుతం కేరళ అందాలను ఆస్వాదిస్తోంది. కేరళలో ఆమె సముద్రపు ఒడ్డు నుంచి ఫేస్ బుక్ లైవ్ కూడా ఇచ్చింది. తాజాగా జగద్గురు ఆదిశంకరాచార్యులు జన్మ

ఛానళ్లలో తన ఆవేదనను, తన పోరాటాన్ని పట్టించుకోవడం లేదనీ, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో యాక్టివ్‌గా వున్న శ్రీరెడ్డి ప్రస్తుతం కేరళ అందాలను ఆస్వాదిస్తోంది. కేరళలో ఆమె సముద్రపు ఒడ్డు నుంచి ఫేస్ బుక్ లైవ్ కూడా ఇచ్చింది. తాజాగా జగద్గురు ఆదిశంకరాచార్యులు జన్మస్థలానికి వెళ్లి అక్కడ కొన్ని ఫోటోలు తీసుకుని షేర్ చేసింది. ఇంకా ఆధ్యాత్మికత గురించి మాటలు చెపుతోంది. 
 
ఐతే ఆమెకు మాత్రం నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. జూన్ 14న నానితో మీరు కలిసిన డర్టీ పిక్చర్ రిలీజ్ చేస్తామన్నారు కదా... ఏది మేడం... 14 దాటి జూన్ 15 వచ్చేసింది. అంటే... మీరు చెప్పిందంతా ఫేకా? మీరు చేసిన కామెంట్లన్నీ అబద్ధాలేనా అంటూ పోస్టింగులు చేస్తున్నారు. మరికొందరయితే రెచ్చగొడుతూ పలు వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. కానీ శ్రీరెడ్డి మాత్రం వాటిపైన ఏమాత్రం స్పందించలేదు.