బిగ్ బాస్ 2 ఏమయినా జరగొచ్చు... జనం టీవీలూ కట్టేయవచ్చు...
బిగ్ బాస్ షో అంటేనే భావోద్వేగాపతో ఆడుకునే ఓ ఆట. వంద రోజుల పాటు కుటుంబ సభ్యులను విడిచిపెట్డి ఉండటమంటే మాటలు కాదు. కనీసం ఫోన్లోనైనా మాట్లాడే అవకాశం ఉండదు. అందుకే మొదటి బిగ్ బాస్ షోలో సంపూర్ణేష్ బాబు వార
బిగ్ బాస్ షో అంటేనే భావోద్వేగాపతో ఆడుకునే ఓ ఆట. వంద రోజుల పాటు కుటుంబ సభ్యులను విడిచిపెట్డి ఉండటమంటే మాటలు కాదు. కనీసం ఫోన్లోనైనా మాట్లాడే అవకాశం ఉండదు. అందుకే మొదటి బిగ్ బాస్ షోలో సంపూర్ణేష్ బాబు వారం రోజులు కూడా బిగ్ బాస్ ఇంట్లో ఉండలేకపోయారు. రెండో సీజన్‌లో మూడో రోజే కిరీటి ఇంటి సభ్యునికి ఇల్లు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను తాను సముదాయించుకున్నారు. రోల్ రైడా కూడా అతనికి ధైర్యం చెప్పారు.
ఇంకో నాలుగు రోజులు గడిస్తే ఇంకెవరెవరు కన్నీళ్లు పెట్టుకుంటారో తెలుస్తుంది. సాధారణంగా బలహీన మనస్కులు భావోద్వేగాలను దాచుకోలేరు. అలాంటి వారిలో కిరీటి ప్రథముడిగా కనిపిస్తున్నారు. అందరికంటే వయసులో చిన్నదయిన సునయనకు ఇంటిపై బెంగ కనిపించలేదు.
ఇదిలావుండగా షో మూడోరోజు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదే అభిప్రాయం బిగ్ బాస్‌కు కలిగినట్లుంది. అందుకే తనీష్‌ని పిలిచి మీ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నారా… అని ప్రశ్నించారు. ప్రత్యేకించి తనీష్ నుంచి ఆశించిన స్టఫ్ రాలేదన్న భావన కూడా బాస్‌కు ఉన్నట్లుంది. ఇది అర్థమయిందో లేదోగానీ తనీష్ మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు.
బాబు గోగినేని మూడో రోజు కూడా ఒక టాస్క్‌ను చేయడానికి నిరాకరించారు. దీంతో… సభ్యుల్లోనే ఒక చర్చ జరిగింది. ఆయన్ను షో నిర్వాహకులే ఆహ్వానించారు కాబట్టి తనను అంత తేలిగ్గా బయటకు పంపలేరన్న ధీమా బాబు గోగినేనిలో ఉందంటూ ముగ్గురు సభ్యులు చాలాసేపు చర్చించుకున్నారు.
ఇంటిలో ఏదైనా జరగవచ్చని రెండో రోజు బిగ్ బాస్ చెప్పారు. దీనికి అనుగుణంగా యజమానులు.. సేవకుల గేమ్‌లో మూడోరోజు పాత్రలు తారుమారయ్యాయి. ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ సాగదీస్తున్నట్లు అనిపిస్తోంది. ఆడవాళ్లు మగవాళ్లలా, మగవాళ్లు ఆడవాళ్లలా నటించిన సన్నివేశం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి సీజన్‌లో హరితేజ చెప్పిన బిగ్ బాస్ హరికథ ఆ సీజన్‌కే హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఆసక్తి పెంచటానికి బిస్ బాస్ ఏమి చేస్తారో చూడాలి. ఇదేవిధంగా కొనసాగితే జనం టివిలు కట్టేస్తారు.