సంబంధిత వార్తలు
- పబ్లిసిటీ కోసం ఇతరుల జీవితాలతో చెలగాటం : శ్రీరెడ్డి ట్వీట్‌పై నాని వైఫ్ కౌంటర్
- శ్రీరెడ్డికి నటుడు నాని లీగల్ నోటీసు... నేను రెడీ అంటున్న శ్రీరెడ్డి
- బిగ్ బాస్ షోలో నానికి ప్రజలు ఎన్ని మార్కులేశారో తెలిస్తే షాకే..
- సస్పెన్స్ వీడింది.. 'బిగ్‌బాస్-2' హౌస్‌కు వెళ్లింది వీరే...
- బిగ్ బాస్-2లో నేను లేను.. నా దురదృష్టం.. కొంతమందికి మాత్రం హ్యాపీ: శ్రీరెడ్డి
నాని 'బిగ్‌బాస్'లో మసాలా ఉంది కానీ ఫ్లేవర్ మిస్సయింది : కత్తి కార్తీక
టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా 'బిగ్ బాస్-2' రియాల్టీ షో గత ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ రెండో సీజన్ షోపై పలువురు పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్-1లో ఓ కం
టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా 'బిగ్ బాస్-2' రియాల్టీ షో గత ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ రెండో సీజన్ షోపై పలువురు పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్-1లో ఓ కంటెస్టెంట్‌గా ఉన్న కత్తి కార్తీక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నాని 'బిగ్ బాస్-2' రియాల్టీ షో గురించి 'ఇంకొంచెం మసాలా' అని చెప్పారని... మసాలా ఉందేమో కానీ, ఫ్లేవర్ మాత్రం మిస్ అయిందని చెప్పుకొచ్చింది.
తెలంగాణ జానపదమో, ఆ భాషనో హౌస్‌లో ఉంటే, ఆ మసాలా ఘాటు తగిలేదని తెలిపింది. తెలంగాణకు చెందిన ఒక్క కంటెస్టెంట్‌ను అయినా పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది.
తొలి సీజన్‌లో ముగ్గురు తెలంగాణ వాళ్లకు చోటుదక్కిందని గుర్తు చేసిన కార్తీక... రెండో సీజన్‌లో మాత్రం అది ఎక్కడా కనిపించలేదని తెలిపింది. ఈ విషయంలో తాను కొంచెం నిరాశకు గురయ్యానని చెప్పింది.
