శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ఇస్లాం
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (09:17 IST)

ఆకాశంలో కనిపించని నెలవంక.. రంజాన్ శనివారమే...

ఆకాశంలో నెలవంక కనిపించలేదు. దీంతో ముస్లిం సోదరుల పవిత్ర పండుగల్లో ఒకటైన రంజాన్ పండుగను శనివారం జరుపుకోవాల్సిందిగా ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. నెలవంకను పరిశీలించి, రంజాన్ తేద

ఆకాశంలో నెలవంక కనిపించలేదు. దీంతో ముస్లిం సోదరుల పవిత్ర పండుగల్లో ఒకటైన రంజాన్ పండుగను శనివారం జరుపుకోవాల్సిందిగా ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. నెలవంకను పరిశీలించి, రంజాన్ తేదీని నిర్ధారించే కమిటీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.
 
నిజానికి గత నెల రోజులుగా ముస్లింలు పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల్లో ఉన్న విషయం తెల్సిందే. ఈ దీక్షలను పూర్తి చేసి శుక్రవారం రంజాన్ పండుగను జరుపుకోవాలని భావించారు. అయితే, గురువారం దేశవ్యాప్తంగా ఎక్కడా నెలవంక కనిపించకపోవడంతో, రంజాన్ పర్వదినాన్ని శుక్రవారం కాకుండా, శనివారం నాడు జరుపుకోవాలని ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ ఒక ప్రకటనలో తెలిపారు. 
 
ఈ ప్రకటనలో 'గురువారం రోజు నెలవంక దర్శనం కాలేదు. అంటే, ఈద్‌ను శుక్రవారం బదులుగా శనివారం నాడు జరుపుకోవాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, కేరళలో మాత్రం నేడే రంజాన్ పండగను జరుపుకుంటున్నారు. నిన్న కోజికోడ్‌లో నెలవంక కనిపించిందని ఇక్కడి ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. దీంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగ శుక్రవారం జరుపుకుంటున్నారు.