1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Hum Fit Toh India Fit: PM Modi nominates Kumaraswamy, here's how Karnataka CM responded

డియర్ మోడీజీ... నా ఆరోగ్యంపై మీకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు : కుమారస్వామి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఫిట్నెస్ ఛాలెంజ్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి స్వీకరించారు. ఈ సవాల్‌పై ఆయన స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేశారు.

Hum Fit Toh India Fit
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఫిట్నెస్ ఛాలెంజ్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి స్వీకరించారు. ఈ సవాల్‌పై ఆయన స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేశారు.
 
"ప్రియమైన నరేంద్ర మోడీజీ... నా ఆరోగ్యంపై మీకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు. శారీరక ఫిట్నెస్ ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని నేను నమ్ముతాను. ఫిట్నెస్ ఛాలెంజ్‌కి నేను మద్దతిస్తున్నాను. యోగా, ట్రెడ్‌మిల్ నా దైనందిన జీవితంలో భాగమే. నా రాష్ట్ర ప్రజల ఫిట్నెస్‌ను మరింతగా పెంచేందుకు మీ సహకారం కావాలి" అంటూ పేర్కొన్నారు. 
 
కాగా, తన ఫిట్నెస్ వీడియోను పోస్టు చేసిన నరేంద్ర మోడీ, దాన్ని కుమారస్వామికి బుధవారం ఉదయం ఫార్వార్డ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్‌ను ప్రధాని మోడీ స్వీకరించిన విషయంతెల్సిందే. 
 
'మీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను.. విరాట్! త్వరలోనే నా వీడియోను షేర్ చేస్తాను' అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా, మోడీ యోగాతో పాటు పలు శారీరక వ్యాయమాలు చేసిన 2 నిమిషాల నిడివిగల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కట్టుకున్న భార్యను హెడ్‌కానిస్టేబులే మోసం చేశాడు.. రెండో భార్యతో సంసారం..