1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Karnataka Higher Education doesn't enthuse G.T. Deve Gowda

8వ తరగతి చదివిన ఎమ్మెల్యేకు ఉన్నత విద్యాశాఖ...

ఎనిమిదో తరగతి చదవిన నేతకు ఉన్నత విద్యాశాఖను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కట్టబెట్టారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీనిపై సీఎం కుమార స్వామి స్పందించారు.

Karnataka
ఎనిమిదో తరగతి చదవిన నేతకు ఉన్నత విద్యాశాఖను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కట్టబెట్టారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీనిపై సీఎం కుమార స్వామి స్పందించారు. కేవలం ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తికి ఉన్నత విద్యాశాఖను అప్పగించడంలో తప్పేమీ లేదన్నారు. బీఎస్సీ చదివిన తాను సీఎంగా పని చేస్తున్నానని గుర్తుచేశారు.
 
ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరి స్థానం నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్యను ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరొంచిన జేడీఎస్ నేత జీటీ దేవెగౌడను కుమారస్వామి తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి శాఖల కేటాయింపుల్లో భాగంగా జీటీ దేవెగౌడకు ఉన్నత విద్యాశాఖను అప్పగించారు.
 
దీనిపై కలత చెందిన జీటీ దేవెగౌడ.. తాను మంత్రిగా పని చేయడానికి ఉన్నత విద్యాశాఖ కంటే చిన్న తరహా నీటిపారుదల శాఖ మెరుగైందన్నారు. ఆయన వ్యాఖ్యలను సీఎం కుమారస్వామి కొట్టి వేశారు. శాఖల కేటాయింపుల మీద అసమ్మతిపై సీఎం స్పందిస్తూ కొందరు వ్యక్తులు కొన్ని శాఖల్లోనే పని చేయాలని కోరుకుంటారు. కానీ ప్రతి శాఖలోనూ సమర్థవంతంగా పని చేసేందుకు అవకాశం ఉన్నది అని అన్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
'అల్లా' అనుగ్రహం కోసం కుమార్తెను బలిచ్చిన తండ్రి.. ఎక్కడ?