బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By selvi
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (14:50 IST)

ఫాదర్స్ డే.. ఆ భాగ్యం మనదేశంలో లేదు.. కానీ 3 నెలల వేతనంతో కూడిన సెలవులు?

ఫాదర్స్ డే. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో నాన్నల గౌరవార్థం జూన్ నెలలోని మూడవ ఆదివారాన్ని "పితృ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఆధునికత పేరుతో పాటు మహిళలు సైతం పురుషులకు సమానంగా ఉద్యోగాలకు వెళ్తున్న తరుణంల

ఫాదర్స్ డే. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో నాన్నల గౌరవార్థం జూన్ నెలలోని మూడవ ఆదివారాన్ని "పితృ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఆధునికత పేరుతో పాటు మహిళలు సైతం పురుషులకు సమానంగా ఉద్యోగాలకు వెళ్తున్న తరుణంలో కుటుంబ బాధ్యతలతో పాటు పిల్లల పెంపకం, ఇంటి పనుల్ని కూడా ప్రస్తుత పురుషులు సమానంగా పంచుకుంటున్నారు. అలాంటి తండ్రుల గౌరవార్థం జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. 
 
అయితే కొత్తగా తండ్రి అయిన వారికి ఒక్కరోజైనా వేతనంతో కూడిన పితృత్వ సెలవు ఇచ్చేందుకు మనదేశం సిద్ధంగా లేదని యునిసెఫ్ పేర్కొంది. తండ్రి అయిన ఆనందాన్ని ఆస్వాదించేందుకు వేతనం చెల్లింపుతో కూడిన ప్యాటర్నటీ లీవులు లేని దేశంగా భారత్‌ను యునిసెఫ్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా వేతనంతో కూడిన పితృత్వ సెలవులు లేని 90 దేశాల్లో భారత్ కూడా ఒకటి. 
 
ప్రపంచంలో ఏడాదిలోపు వయసున్న చిన్నారుల్లో మూడింట రెండొంతులు ఈ 90 దేశాల్లోనే ఉన్నారని యునిసెఫ్ పేర్కొంది. కానీ కొత్తగా తండ్రి అయిన ఆనందాన్ని అనుభవించేందుకు వేతనంతో కూడిన సెలవుల్లేవని యునిసెఫ్ వెల్లడించింది. భారత్, నైజీరియాలో చిన్నారుల జనాభా ఎక్కువని, తమ చిన్నారులతో తగినంత సమయం గడిపేందుకు తండ్రులకు అవకాశం లేదని తెలియజేసింది. 
 
కానీ ప్రస్తుతం మనదేశంలో కొత్తగా తండ్రి అయిన వారికి మూడు నెలల వేతనంతో కూడిన పితృత్వ సెలవులిచ్చేందుకు ప్యాటర్నటీ బెనిఫిట్‌ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సభ ముందుంచే అవకాశం వుందని యునిసెఫ్ తన నివేదికలో వెల్లడించింది.