బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By selvi
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (16:20 IST)

త్వరలోనే ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ను చూస్తాం: రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోందని.. చాలామంది ఐపీఎల్ టోర్నీ తరహాలో ఫిఫా ప్రపంచకప్‌ను చూసేందుకు సిద్ధంగా వున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ తెలిపారు. త్వరలోనే ఫిఫా వరల్డ్‌క

భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోందని.. చాలామంది ఐపీఎల్ టోర్నీ తరహాలో ఫిఫా ప్రపంచకప్‌ను చూసేందుకు సిద్ధంగా వున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ తెలిపారు. త్వరలోనే ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత జట్టు పాల్గొంటుందని మంత్రి తెలిపారు. ఫుట్‌బాల్‌లే కాదు ఏ క్రీడలోనైనా పోటీ ఇచ్చే సత్తా భారత్‌కు వుందని పేర్కొన్నారు. 
 
ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్‌ పాల్గొనకపోయినప్పటికీ ఆ టోర్నీలో పాల్గొనే సత్తా మనకుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల శిక్షణ పొందే అవకాశాలు, వారికి లభించే మద్దతు గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్పుకొచ్చారు. పాఠశాలలు కేవలం చదువులపై కాకుండా ఆటల్లో ప్రోత్సాహం కలిగించేలా దృష్టి సారించాలని కోరారు.
 
ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల నిబద్దత పరంగా కొన్నిసార్లు బ్రెజీల్‌, మరి కొన్ని సార్లు అర్జెంటీనా జట్లు ఇష్టమని, కానీ భారత్‌కే తాను అతిపెద్ద అభిమానినని రాథోడ్‌ చెప్పారు. త్వరలోనే ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ను చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.