శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 10 జూన్ 2018 (15:17 IST)

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలి: నరేంద్ర మోడీ

చైనాలోని చింగ్‌డావో వేదికగా ఎస్సీఓ సదస్సు జరుగుతోంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ, పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుసేన్ పాల్గొన్న

చైనాలోని చింగ్‌డావో వేదికగా ఎస్సీఓ సదస్సు జరుగుతోంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ, పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుసేన్ పాల్గొన్నారు. ఆదివారం జరిగిన సమావేశానికి చైనా అధినేత జిన్‌పింగ్ అధ్యక్షత వహించారు.
 
ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, పొరుగు దేశాలతోనూ, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) దేశాలతోనూ అనుసంధానానికి భారతదేశం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎస్సీఓ దేశాల నుంచి కేవలం 6 శాతం పర్యాటకులే భారత్‌కు వస్తున్నారన్నారు. ఉమ్మడి సంప్రదాయాలపై అవగాహన ద్వారా పర్యాటకులకు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. 
 
ఉగ్రవాద ప్రభావానికి లోనైన దేశం ఆప్ఘనిస్థాన్ అని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు ఘని సరైన చర్యలు చేపడతారని ఆశిస్తున్నానన్నారు. భారత్‌లో బుద్దిస్ట్‌ ఫెస్టివల్‌, ఎస్సీవో ఫుడ్‌‌ఫెస్టివల్‌ నిర్వహిస్తామని, ఎస్‌సీవో దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. 
 
ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సెక్యూర్ అనే ఆంగ్ల పదంలోని అక్షరాలకు ప్రత్యేక అర్థాన్ని తెలిపారు. ఎస్ = ప్రజలకు భద్రత, ఈ = ఆర్థికాభివృద్ధి, సీ = ఈ ప్రాంతంలో అనుసంధానం, యూ = సమైక్యత, ఆర్ = సార్వభౌమాధికారం, సమగ్రతలను గౌరవించడం, ఈ = పర్యావరణ పరిరక్షణ అని వీటన్నింటినీ సాధించేందుకు ఎస్‌సీఓ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
 
భూగోళం నిర్వచనాన్ని డిజిటల్, భౌతిక అనుసంధానం మార్చుతోందని, పొరుగు దేశాలతోనూ, ఎస్‌సీఓ ప్రాంతంలోనూ అనుసంధానానికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఈ సదస్సు విజయవంతమవడానికి భారతదేశం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు.