ఎన్నికల దూరంగా హఫీజ్ పార్టీ.. మోదీని చంపేస్తారట.. అమెరికా, భారత్ దేశాల్లో?
భారత్, అమెరికా దేశాల్లో ఇస్లాం జెండా ఎగురుతుందని.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాక్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ)
భారత్, అమెరికా దేశాల్లో ఇస్లాం జెండా ఎగురుతుందని.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాక్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ) హపీజ్ సయీద్ అనుచరుడు మౌలానా బషీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఇజ్రాయెల్ దేశాలు ముక్కలు కావడం తథ్యమన్నాడు.
ఈ నేపథ్యంలో ఉమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, ముంబై మారణహోమం సూత్రధారి హఫీజ్ సయీద్ పాకిస్థాన్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేలింది. ఇటీవలే మిల్లీ ముస్లిం లీగ్ అనే రాజకీయ పార్టీని సయీద్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
కానీ ఇంత వరకు పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సయీద్ పార్టీ అభ్యర్థులు అల్లాహూ అక్బర్ తెహ్రీక్ (ఏఏటీ) పార్టీ తరపున పోటీ చేయబోతున్నారని సమాచారం. ఏఏటీ పార్టీ తరపున సయీద్ అనుచరులు ఎన్నికల్లో పోటీ చేస్తారని జమాత్ ఉద్దవా నేతలు వెల్లడించారు. ఈ క్రమంలో 200 మంది హఫీజ్ అనుచరులు ఎన్నికల బరిలోకి దిగుతారని.. వీరికి ఏఏటీ టిక్కెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.