శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (13:36 IST)

నేరేడు గింజల పొడి మధుమేహానికి దివ్యౌషధం...

నేరేడు పండ్లను వారానికి రెండు కప్పుల మోతాదులో లేకుంటే రోజుకు పావు కప్పు మేర తీసుకుంటే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాల

నేరేడు పండ్లను వారానికి రెండు కప్పుల మోతాదులో లేకుంటే రోజుకు పావు కప్పు మేర తీసుకుంటే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలామంచిది.


ఇది డయాబెటిక్ రోగుల్లో రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. తద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. అలాగే నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.
 
అలాగే నేరేడు పండ్లు గుండె జబ్బులను దూరం చేస్తాయి. ఇందులోని పొటాషియం, యాంటీయాక్సిడెంట్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. నేరేడు పండ్లలో వుండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించుకోవచ్చు. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి.

వేసవిలో నేరేడు పండ్లను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను దూరం చేసుకోవచ్చు. నేరేడు గింజలను పౌడర్ చేసి.. ఆ పౌడర్‌ను పాలతో మిక్స్ చేసుకుని ముఖానికి పూతలా వేసి మరుసటి రోజు కడిగేస్తే మొటిమలు తొలగిపోతాయి.
 
అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందుకు నేరేడు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో వుండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.