గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (15:08 IST)

నాకూ వల వేశాడు.. మాట్లాడే తీరునచ్చక తిరస్కరించాను : అనసూయ

చికాగో వ్యభిచార దందాపై టాలీవుడ్‌కు చెందిన హాట్ యాంకర్ అనసూయ స్పందించారు. ఈమెను కూడా ఎన్నారై దంపతులు సంప్రదించారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, 'చాలా రోజులుగా నేను అమెరికా

చికాగో వ్యభిచార దందాపై టాలీవుడ్‌కు చెందిన హాట్ యాంకర్ అనసూయ స్పందించారు. ఈమెను కూడా ఎన్నారై దంపతులు సంప్రదించారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, 'చాలా రోజులుగా నేను అమెరికా వెళ్లలేదు. 2014లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను.
 
2016లో అమెరికా నెంబర్‌తో శ్రీరాజ్‌ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్‌ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని కోరాడు. అతను మాట్లాడే విధానం నచ్చక నేను తిరస్కరించాను. నేను తిరస్కరించినా కూడా పోస్టర్‌లో నాఫొటోను ముద్రించారు. ఆ ఈవెంట్‌లో పాల్గొనడం లేదని అప్పట్లో నేను ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశాను' అని వివరించింది. 
 
కాగా, చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందా వ్యవహారంలో ఈ స్కామ్ నిర్వహిస్తూ వచ్చిన ఎన్నారై దంపతులు మోదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజు, ఆయన భార్య చంద్రలను ఫెడరల్ ఏజెన్సీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
అదేవిధంగా మా అధ్యక్షుడు శివాజీ రాజా స్పందిస్తూ, కిషన్‌ మోదుగుముడి నిర్వహించే వ్యవహారలపై మాకు అవగాహన ఉంది. అతను ఓ రెండు సినిమాలకు కో ప్రోడ్యూసర్‌, ప్రొడక్షన్‌ మెనేజర్‌గా చేసినట్లున్నాడు. ఈవెంట్స్‌ ప్రదర్శనల కోసం విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులను జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినట్టు తెలిపారు.