గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (12:42 IST)

అలాంటి దర్శకుడుతో అఫైర్ అంటగట్టారు.. బాధేసింది.... హాట్ యాంకర్

తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అలాగే, బుల్లితెరపై తన అందచందాలను ఆరబోస్తూ యువతీయువకుల మనసులను కొల్లగొట్టిన హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఆ మధ్య వీరిద్దరి

తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అలాగే, బుల్లితెరపై తన అందచందాలను ఆరబోస్తూ యువతీయువకుల మనసులను కొల్లగొట్టిన హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఆ మధ్య వీరిద్దరికీ అఫైర్ ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి. 
 
వీటిపై హాట్ యాంకర్ అనసూయ తాజాగా వివరణ ఇచ్చారు. తన కెరీర్ ప్రారంభంలో హెచ్ఆర్ ఉద్యోగిగా పని చేశానని... ఆ తర్వాత మీడియాలో ప్రవేశించినట్టు తెలిపారు. టెలివిజన్ షోలలో యాంకర్‌గా పని చేసి, ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టినట్టు వివరించింది. అయితే, మీడియా నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలసి పని చేశానని... ఆ సమయంలో ఆయనతో తనకు అపైర్ అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ఆ సమయంలో తాను గర్భవతినని... ఆ వార్తలతో తాను చాలా భయపడిపోయానని చెప్పింది. అయితే, తన భర్త తనకు అండగా నిలబడ్డారని... నేను నమ్మనంత వరకు నీవు భయపడాల్సిన అవసరం లేదని తనకు ధైర్యం చెప్పారని తెలిపింది. తన కుటుంబసభ్యులు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని... అందుకే యాక్టింగ్ కెరీర్‌లో కొనసాగుతున్నానని చెప్పింది.
 
ఇకపోతే అనసూయ తాజాగా నటించిన చిత్రం 'రంగస్థలం'. ఇందులో ఆమె రంగమ్మత్తగా నటించి ప్రేక్షకులను ఆలరించారు. ఇప్పుడు సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆమె పంచుకుంది. రంగమ్మత్త క్యారెక్టర్ తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపింది. 'రంగస్థలం' సినిమా తర్వాత రెమ్యునరేష్ పెంచాననే వార్తల్లో ఏమాత్రం నిజంలేదన్నారు.