శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (16:48 IST)

"రంగస్థలం" నటీనటులంతా చించేశారంటుంటే ఉబ్బితబ్బిబ్బులైపోతున్నా : రంగమ్మత్త

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంచి కామెంట్స్ చేస్తున్నారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంచి కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా, చిత్రంలో నటించిన వారంతా చించేశారంటూ ప్రశంసలు వస్తున్నాయి. 
 
దీనిపై ఈ చిత్రంలో 'రంగమ్మత్త'గా నటించిన హాట్ యాంకర్ అనసూయ స్పందిస్తూ, ఈ చిత్రానికి తాము ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ రావటంతో చిత్రయూనిట్ ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా, టీనటులంతా చించేశారు అంటూ చర్చించుకుంటున్న ప్రేక్షకులు ప్రత్యేకంగా ఓ కారెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆ కారెక్టరే 'రంగమ్మత్త'. ఈ క్యారెక్టర్‌లో బుల్లితెర బ్యూటీ, యాంకర్ అనసూయ ఒదిగిపోయిందంటూ చెప్పుకుంటున్నారు. 
 
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ.. 'అప్పుడు 'బాహుబలి' చిత్రంలో శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరెవ్వరూ సూట్ కారు అని మాట్లాడుకున్న ప్రేక్షకులు.. ఇప్పుడు రంగస్థలం చిత్రంలో 'రంగమ్మత్త'గా అనసూయ తప్ప మరెవ్వరూ సూట్ కాలేరు అని చెప్పుకోవటం చాలా ఆనదాన్నిస్తోంది. ఇలాంటి ప్రశంసల కంటే మించింది మరేముంటుంది అని చెప్పుకుంటూ మురిసిపోయింది.