శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 28 ఏప్రియల్ 2018 (10:44 IST)

రష్మీతో బర్త్ డే పార్టీ.. ఫ్యామిలీతో ట్రిప్పేసిన రంగమ్మత్త..

సినీనటి అనసూయ ప్రస్తుతం ఫ్యామిలీతో ట్రిప్పేసింది. ''రంగస్థలం'' సినిమా షూటింగ్, ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడిపిన రంగమ్మత్త.. ప్రస్తుతం బ్రేక్ తీసుకుని కుటుంబంతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా

సినీనటి అనసూయ ప్రస్తుతం ఫ్యామిలీతో ట్రిప్పేసింది. ''రంగస్థలం'' సినిమా షూటింగ్, ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడిపిన రంగమ్మత్త.. ప్రస్తుతం బ్రేక్ తీసుకుని కుటుంబంతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ క్షణాలు ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందోనని ట్వీట్ చేసింది. 
 
మరోవైపు ప్రముఖ యాంకర్లు రష్మికి, అనసూయ పార్టీ చేసుకున్నారు. రష్మి బర్త్ డే సందర్భంగా ఓ క్రేజీ ట్వీట్ పెట్టి అనసూయ అభిమానులను ఆకట్టుకుంది. వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో దుమ్ము రేపుతున్నాయి. 
 
రష్మీతో తన బంధం దృఢంగా మారిపోయిందని.. మమ్మల్ని చూస్తే మెంటల్ అనుకుంటారని.. ఇద్దరికీ ఎన్నో థెరపీస్ పూర్తైన తాము చాలా క్రేజీగా మారిపోయామని తెలిపారు. హ్యాపీ బర్త్ డే లవ్ అంటూ రష్మికి అనసూయ బర్త్ డే విషెస్ చెప్పింది. దీనికి తోడు ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అనసూయ పోస్ట్ చేసింది.