శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (17:29 IST)

నితిన్ శ్రీనివాస కల్యాణంలో బాపు ''సంపూర్ణ రామాయ‌ణం''.. ఎలా?(వీడియో)

నితిన్‌, రాశి ఖ‌న్నా, నందితా శ్వేత, ప్ర‌కాశ్ రాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాలోని ఓ బిట్ పాటను వీడియో రూపంలో సినీ యూనిట్ శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేశారు.

నితిన్‌, రాశి ఖ‌న్నా, నందితా శ్వేత, ప్ర‌కాశ్ రాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాలోని ఓ బిట్ పాటను వీడియో రూపంలో సినీ యూనిట్ శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేశారు. 
 
సోమవారం భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం. గాన గంధర్వుడు శ్రీ ఎస్.పి.బాలసుబ్రమణ్యం సుమధుర స్వరంలో మా 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' నుండి ఒక చిన్న పాట'' అంటూ చిత్ర బృందం ఈ వీడియోను విడుదల చేసింది. 
 
ఈ వీడియోలో ఇందులో బాపు ద‌ర్శ‌క‌త్వంలో శోభ‌న్ బాబు, చంద్ర‌క‌ళ‌ న‌టించిన చిత్రం ''సంపూర్ణ రామాయ‌ణం'' నుంచి కొన్ని దృశ్యాల‌ను జ‌త‌చేయ‌డం విశేషం. చాలాకాలం త‌రువాత ఎస్పీబీ పాడిన ఈ పాట‌ను మిక్కీ జె.మేయ‌ర్ స్వ‌ర‌ప‌రిచారు. ఈ చిత్రాన్ని స‌తీష్ వేగేశ్న రూపొందిస్తున్నారు. ఇక శ్రీనివాస కల్యాణం తాజా బిట్ సాంగ్ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.