శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 మార్చి 2018 (11:26 IST)

నితిన్ "ఛ‌ల్ మోహ‌న్ రంగ‌" Jukebox Release

యువ హీరో నితిన్, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కిన చిత్రం "ఛల్ మోహన్ రంగ". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రేష్ట్‌ మూవీస్ పతాకంపై నితిన్ తన సినీ కెరీర్‌లో నటిస్తున్న 25వ సినిమా ఇది. దీనికి

యువ హీరో నితిన్, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కిన చిత్రం "ఛల్ మోహన్ రంగ". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రేష్ట్‌ మూవీస్ పతాకంపై నితిన్ తన సినీ కెరీర్‌లో నటిస్తున్న 25వ సినిమా ఇది. దీనికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. 
 
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన ప‌లు పాటలు విడుద‌ల కాగా, ఇవి సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. 
 
ఈ నేపథ్యంలో ఉగాది శుభాకాంక్ష‌ల‌తో ఆదివారం జ్యూక్ బాక్స్ విడుద‌ల చేశారు. అన్ని పాట‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ క‌థ అందించినట్టు సమాచారం. ఏప్రిల్ 5న మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేశారు.