శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (17:36 IST)

''కృష్ణార్జునయుద్ధం'' ఉరిమే మనసే లిరిక్స్ మీ కోసం (వీడియో)

నేచురల్ స్టార్ నాని ఎంసీఏ సినిమా సక్సెస్ తర్వాత కృష్ణార్జునయుద్ధంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రొమాంటిక్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడ

నేచురల్ స్టార్ నాని ఎంసీఏ సినిమా సక్సెస్ తర్వాత కృష్ణార్జునయుద్ధంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రొమాంటిక్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నాని సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌లో నాని డైలాగ్స్ అదిరాయి. 
 
అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించిన తొలి సాంగ్ లిరిక్స్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ మారిన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణార్జునయుద్ధం రెండో పాట లిరిక్స్‌ను గురువారం విడుదల చేశారు. ''ఉరిమే మనసే'' అని సాగే ఈ పూర్తి పాట లిరిక్స్ యూట్యూబ్‌లో విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకేముంది? ఉరిమే మనసే లిరిక్స్‌ను ఓ లుక్కేయండి.