గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (13:58 IST)

కారు ప్రమాదం.. పన్ను ఊడిందా? వారం రోజులు విశ్రాంతి అందుకేనా?

నేచురల్ స్టార్ నాని కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్‌లో నాని కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నానికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఇదే విషయాన్ని నాని కూడా ట్విట్టర్ ద్వా

నేచురల్ స్టార్ నాని కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్‌లో నాని కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నానికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఇదే విషయాన్ని నాని కూడా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు స్వల్ప పాటి గాయాలైనాయని.. వారం రోజుల తర్వాత షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పారు.

కానీ నానికి కారు ప్రమాదంలో పన్ను ఊడిందని.. డైంటిస్ట్ సలహా మేరకు ఆర్టిఫిషియల్ పన్నుతో శస్త్రచికిత్స చేసారని.. అందుకే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. 
 
వైద్యుల సలహా మేరకు నాని వారం పాటు విశ్రాంతి తీసుకుని ఆపై తాజా చిత్రం ''కృష్ణార్జున యుద్ధం'' చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అనంతలో జరుగుతోంది. ఈ షూటింగ్ ముగించుకుని హైదరాబాదుకు తిరిగి వస్తుండగా కారు ప్రమాదం ఏర్పడింది.