మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (11:43 IST)

#Peddapuli Song రంగా.. రంగా.. రంగా.. చిందేయి సామి రంగా అంటోన్న నితిన్.. (వీడియో)

నితిన్ హీరోగా నటిస్తున్న శ్రీనివాస కల్యాణం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్, నితిన్ నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ''ఛల్ మోహన్ రంగ'' సినిమా రూపొందుతోంది. త్ర

నితిన్ హీరోగా నటిస్తున్న శ్రీనివాస కల్యాణం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్, నితిన్ నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ''ఛల్ మోహన్ రంగ'' సినిమా రూపొందుతోంది. త్రివిక్రమ్ అందించిన స్క్రిప్టులో హీరోగా నితిన్, హీరోయిన్‌గా మేఘాఆకాశ్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ ఐదో తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ సినిమా సంబంధించిన ఓ పాటను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. తెలంగాణ బాగా పాపులర్ అయిన ''నువు పెద్దపులి .. నువ్వు పెద్దపులి..'' అంటూ సాగే పాట తరహాలో ''రంగా.. రంగా.. రంగా.. చిందేయి సామి రంగా..'' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బోనాల జాతర సందర్భంలో వచ్చే పాటగా దీనిని చిత్రీకరించారు. తమన్ కూర్చిన ఈ ఊరమాస్ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ పాట వీడియోను మీరూ ఓ లుక్కేయండి.