సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (18:13 IST)

నిర్మాతగా పవన్ కల్యాణ్: 'ఛల్ మోహన్ రంగ' ఫస్ట్ లుక్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు దాదాపు దూరమయ్యారనే చెప్పాలి. పూర్తిస్థాయి రాజకీయాల్లో దిగారు. 2019 ఎన్నికల వరకు ఆయన సినిమాల వైపు చూసే అవకాశం లేదని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ నిర్మాణ సారథ్యం వహ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు దాదాపు దూరమయ్యారనే చెప్పాలి. పూర్తిస్థాయి రాజకీయాల్లో దిగారు. 2019 ఎన్నికల వరకు ఆయన సినిమాల వైపు చూసే అవకాశం లేదని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ నిర్మాణ సారథ్యం వహించనున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో, యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ''ఛల్ మోహన్ రంగ" చిత్రానికి ఆయన నిర్మాణ సారథ్యం వహించనున్నారు. 
 
ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆదివారం రిలీజైంది. నితిన్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. పవన్  అంటే నితిన్‌కు చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాను త్రివిక్రమ్ పాటు పవన్ నిర్మాతగా వ్యవహరించడం ద్వారా ఈ సినిమాపై అభిమానుల మధ్య భారీ అంచనాలు పెరిగిపోయాయి. 
 
ఛల్ మోహనరంగతో పాటు నితిన్‌ శ్రీనివాస కల్యాణం సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాతో 14 ఏళ్ల తరువాత నితిన్‌.. దిల్‌రాజుతో కలిసి పనిచేస్తున్నాడు. పీకే క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.