మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi

గాయత్రిలో శ్రియ లుక్.. చీరకట్టులో అదరగొట్టింది.. హాట్ ఫోటోలు కూడా?

శ్రియ అర్ధనగ్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవకాశాలు తగ్గాయనే ఉద్దేశంతోనే ఏమోకానీ.. హీరోయిన్ శ్రియ హాట్ హాట్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసి కలకలం రేపింది. 37 సంవత్సరాల వయ

శ్రియ అర్ధనగ్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవకాశాలు తగ్గాయనే ఉద్దేశంతోనే ఏమోకానీ.. హీరోయిన్ శ్రియ హాట్ హాట్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసి కలకలం రేపింది. 37 సంవత్సరాల వయసులోనూ హీరోయిన్‌గా అవకాశాలు సొంతం చేసుకుంటున్న శ్రియ..  ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. 
 
ఇకపోతే.. డైలాగ్ కింగ్ మోహన్‎బాబు తన సొంత బ్యానర్ శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'గాయత్రి'లో మంచు విష్ణు, శ్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నిఖిల విమల్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ బాణీలు కట్టారు. ఇటీవలే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి. తాజాగా శ్రియ లుక్ విడుదలైంది. 
 
ఈ లుక్‌లో శ్రియ చీరకట్టులో అదరగొట్టింది. 'నేనెదనుకుంటే అది చెప్పడం నాకలవాటు.. తర్వాత సంగతి తర్వాత..' అనే కాప్షన్ పోస్టర్ పై ఉంచారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది.