మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 జనవరి 2018 (12:31 IST)

భాగమతి లుక్ అదుర్స్: స్వీటీ ఖాతాలో హిట్ ఖాయం

బాహుబలికి ముందే అనుష్క ఓకే చేసిన భాగమతి సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం భాగమతి విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే దేవసేన పుట్టిన రోజును పురస్కరించుకుని టెర్రిఫిక్ లుక్‌ను విడ

బాహుబలికి ముందే అనుష్క ఓకే చేసిన భాగమతి సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం భాగమతి విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే దేవసేన పుట్టిన రోజును పురస్కరించుకుని టెర్రిఫిక్ లుక్‌ను విడుదల చేశారు. సినిమాను జనవరి 26న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. 
 
మూవీలో గ్రాఫిక్స్ వర్క్ చక్కగా ఇచ్చేందుకు టీమ్ కృషి చేస్తోందని.. అందుకే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా లేట్ అవుతుంది. దీంతో భాగమతిని జనవరి 26న విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. తాజాగా భాగమతి సినిమాకు సంబంధించిన లుక్ విడుదలైంది. 
 
ఈ చిత్రాన్ని యువి క్రియేష‌న్స్ నిర్మించింది. ఈ నేపథ్యంలో నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చిత్ర బృందం కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఇందులో అనుష్క లుక్ సింప్లీ అండ్ సూపర్‌గా వుంది. ఈ లుక్‌ను బట్టి స్వీటీకి ''భాగమతి'' హిట్ ఇస్తుందని సినీ పండితులు చెప్తున్నారు.