శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2017 (12:13 IST)

రజనీకాంత్ 'spiritual politics' ప్రకటన.. ధ్యానముద్రలో కాసేపు.. కమల్ ట్వీట్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేగాకుండా రజనీకాంత్ రాజకీయ ప్రకటనను పలువురు తమిళ సినీ ప్రముఖలు స్వాగతిస్తున్నారు. తమి

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేగాకుండా రజనీకాంత్ రాజకీయ ప్రకటనను పలువురు తమిళ సినీ ప్రముఖలు స్వాగతిస్తున్నారు. తమిళ ప్రజలు కూడా మార్పు వస్తుందని తలైవా రాక కోసం ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ.. తలైవాకు చాలామంది సోషల్ మీడియాలో అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన రజనీకి విలక్షణ నటుడు కమల్ హాసన్ అభినందనలు చెప్పారు. రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా రజనీ స్నేహితుడు కమల్ హాసన్ స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. సమాజం పట్ల మీకు ఉన్న నిబద్ధత అభినందనీయం అన్నారు. ఇకపోతే.. కమల్ హాసన్ కూడా తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త పార్టీని ప్రారంభిస్తానని తెలిపారు. 2018లో పార్టీ వివరాలు ప్రకటిస్తానని  వెల్లడించారు.  
 
మరోవైపు రాజకీయాల్లో వచ్చేందుకు సమయం ఆసన్నమైందని.. రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు రజనీకాంత్ ప్రకటించేందుకు ముందు కొన్ని నిమిషాల పాట ధ్యాన ముద్రలో వున్నారు. తర్వాత 'కర్మణ్యే వాధికారస్తే' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'జైహింద్' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. మరోవైపు, రజనీ ప్రసంగం మొత్తం పక్కా ప్రణాళికతోనే జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఎవర్నీ నొప్పించకుండా, తన మనసులోని మాటను రజనీకాంత్ స్పష్టం చేశారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారో అనే విషయాన్ని రజనీ వెల్లడించలేదు. తమిళనాడులో ద్రవిడ పార్టీలే ఇంతకాలం అధికారంలో ఉన్నాయని.. ఇకపై కొత్త పార్టీని తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఆధ్యాత్మిక రాజకీయ పార్టీ ఉద్భవించనుందని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఈ పార్టీ వుంటుందని.. రజనీకాంత్ ప్రకటించారు