శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శుక్రవారం, 29 డిశెంబరు 2017 (19:00 IST)

తులా రాశివారి ఫలితాలు... 2018లో ఇలా వున్నాయి...

తులా రాశి : చిత్త 3, 4 పాదములు (రా, రి) స్వాతి 1, 2, 3 4 పాదములు (రూ, రే, రో, తా) విశాఖ 1, 2, 3 పాదములు (తీ, తూ, తే), ఆదాయం-11, వ్యయం -5, పూజ్యత -2, అవమానం-2 ఈ రాశివారికి అక్టోబర్ 11వ తేదీ వరకు జన్మము నందు బృహస్పతి, ఆ తదుపరి ద్వితీయము నందు, ఈ సంవత

తులా రాశి : చిత్త 3, 4 పాదములు (రా, రి) స్వాతి 1, 2, 3 4 పాదములు (రూ, రే, రో, తా) విశాఖ 1, 2, 3 పాదములు (తీ, తూ, తే), ఆదాయం-11, వ్యయం -5,  పూజ్యత -2, అవమానం-2 
 
ఈ రాశివారికి అక్టోబర్ 11వ తేదీ వరకు జన్మము నందు బృహస్పతి, ఆ తదుపరి ద్వితీయము నందు, ఈ సంవత్సరం అంతా తృతీయము నందు శని, ఈ సంవత్సరం అంతా చతుర్థము నందు కేతువు, రాజ్యము నందు రాహువు సంచరిస్తారు. 
 
ఈ సంవత్సరం మీ గోచారం పరిశీలింపగా "పరోపకారాయ ఫలంతి వృక్షాః" అన్నట్లుగా ఏ ఫలితాలు మీరు ఆశించకుండా అందరికీ సహాయ, సహకారాలు అందించడం వల్ల మంచి గుర్తింపు లభించడంతో పాటు పాత సమస్యలు పరిష్కరించబడతాయి. శని, గురువుల సంచారం అనుకూలంగా వుంది. అందువలన చాలా మంచి ఫలితాలు, చాలా అధికస్థాయిలో అందుకుంటారు. మానసిక  ప్రశాంతత లభిస్తుంది. మీ సలహాలు కుటుంబంలో అందరూ పాటిస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగములు పెంపొందుతాయి. 
 
అనుకున్న పనులు విజయవంతంగా సాధించగలుగుతారు. గురు, రాహువుల సంచారం కూడా అనుకూలంగానే ఉన్న దృష్ట్యా అందరి సహాయ, సహకారాలు అందుతాయి. దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతిపనిని అధిక శ్రమచేసి సాధిస్తారు. సంఘంలో కూడా ప్రత్యేక గౌరవం, గుర్తింపు లభిస్తాయి. కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. సలహాలు, సహాయం ఆశించవద్దు. దూర ప్రాంత ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యుల సలహా, సహకారం మీకెంతో ఉపకరిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. 
 
రోజువారీ కార్యక్రమాలు అన్ని ప్రశాంతంగా సాగుతాయి. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. కుజుడు చతుర్థంలో స్తంభన దృష్ట్యా కొంత ధననష్టము, బంధువులతో ఇబ్బందులు, అనారోగ్యం వంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల యందు సంవత్సరం అంతా బాగుంటుంది. ఖర్చులు నియంత్రించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. మీ మాటతీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ప్రతిపనిలోను స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. 
 
వృత్తి వ్యాపారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కావలసిన పెట్టుబడులు సమకూరుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి అనుకూలమైన కాలం అనే చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆడిట్, అకౌంట్స్ రంగాల్లో వారికి సత్కాలం. వ్యవసాయ రంగాల్లో వారు కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ శ్రమకు తగిన రాబడి లభిస్తుంది. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు.
 
శాస్త్రజ్ఞులకు, కళా, క్రీడా రంగాల్లో వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి నిర్వహణ లోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూదాలు, పందాలకు దూరంగా ఉండాలి. విదేశాల నుంచి సంతానం రాక సంతోషాన్నిస్తుంది. మొత్తానికి ఈ సంవత్సరం అంతా విజయవంతమైన ఫలితాలు అధికమనే చెప్పవచ్చు.
 
* ఈ రాశివారు వెంకటేశ్వర స్వామిని తులసీ దళాలతో పూజించడం వల్ల సర్వదా మనోసిద్ధి చేకూరుతుంది. 
 
* చిత్త నక్షత్రం వారు ''జాతి పగడం'', స్వాతి నక్షత్రం వారు ''ఎర్ర గోమేధికం'', విశాఖనక్షత్రం వారు ''వైక్రాంతమణి'' ధరించిన పురోభివృద్ధి పొందుతారు. 
 
* చిత్తా నక్షత్రం వారు ''తాటిచెట్టును'', స్వాతి నక్షత్రం వారు ''మద్ది'' చెట్టును, విశాఖ నక్షత్రం వారు ''మొగలి'' చెట్టును దేవాలయాల్లోని కానీ విద్యాసంస్థల్లో కానీ, ఖాళీ ప్రదేశాల్లో నాటినట్లైతే అభివృద్ధి కానవస్తుంది.