ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (13:23 IST)

చిరంజీవి చిన్నల్లుడు హీరోయిన్ ఎవరో తెలుసా?

చిరంజీవి చిన్నల్లుడికి జోడీగా మేఘాఆకాశ్ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నితిన్ జోడీగా ''లై'' మేఘా ఆకాశ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చిన్నల్లుడు

చిరంజీవి చిన్నల్లుడికి జోడీగా మేఘాఆకాశ్ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నితిన్ జోడీగా ''లై'' మేఘా ఆకాశ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చిన్నల్లుడు నటించే సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా కల్యాణ్ నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. 
 
కల్యాణ్ నటించే సినిమాకు మెగాస్టార్ చిరంజీవి కూడా సలహాలిచ్చారట. ఆయన చెప్పినట్టుగా స్క్రిప్ట్‌పై కసరత్తు జరుగుతోందట. ఈ సినిమాలో కథానాయికగా ''మేఘా ఆకాశ్''ను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నారు. అలాగే చెర్రీ రంగస్థలం షూటింగ్‌తో పాటు సైరా నిర్మాణ పనుల్లో బిజీగా వున్నాడు.